బెజవాడ గ్యాంగ్ వార్ అలజడి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా సంచలనం సృష్టిస్తూ ఉండగానే గుంటూరు లో కూడా అదే విధంగా గ్యాంగ్ వార్ జరిగింది. రెండు గ్యాంగ్ లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గుంటూరు నగరం నడిబొడ్డున రెండు గ్రూపులు గొడవకు దిగాయి. ఒక అమ్మాయి విషయంలో గుంటూరు లో గొడవ పడ్డారు. దీనితో పోలీసులు వచ్చి వారిని విడగొట్టారు. దీనితో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. 

 

కృష్ణ నగర్ కి చెందిన ఒక బీటెక్ చదివే యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించగా ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటంతో గొడవలు జరిగాయి. దమ్ముంటే డొంక రోడ్డు సెంటర్ కి రావాలి అంటూ ఆ అమ్మాయి సన్నిహితంగా ఉండే యువకుడు ఛాలెంజ్ చేయడంతో గొడవ ముదిరింది. రెండు వర్గాలు కలిపి 30 మంది గొడవలో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: