దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో సీనియర్ సిటిజన్లు ఇళ్ళల్లో ఉండటమే మంచిది అని చెప్తూ ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీ సీనియర్ సురాక్ష కవచ్ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చింది. 

 

ఇందులో నమోదు చేసుకున్న వృద్దులకు ఔష‌ధాలు, ఆహారంతో పాటు నిత్యావ‌స‌రాల‌ను వారి ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. వారికి కరోనా ప్రమాదం ఎక్కువగా ఉందని ఢిల్లీ పోలీసుల సీనియర్ సిటిజన్ సెక్యూరిటీ సెల్‌కు పంపిస్తామ‌ని, ఆ త‌రువాత సీనియర్ సిటిజన్లకు కార్డులు జారీ లీగల్ ఎయిడ్ న్యాయవాది దినేష్ కుమార్ గుప్తా మీడియాకు వివరించారు. లక్షణాలు ఉన్న వారిని ఆస్పత్రికి కూడా తరలిస్తామని చెప్పారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: