కన్నడ నటి మరియు యాంకర్ చందన కేసులో పురోగతి లభించింది. ఆమె ప్రియుడు దినేష్ ను ఆదివారం అరెస్ట్ చేశారు. మే నెల 28 న నటి చందన ఓ సెల్ఫీ  వీడియో లో తనమరణానికి కారణం తన ప్రియుడు దినేష్ అంటూ చెప్పి తానూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తనను ఆమె ప్రేమికుడు దినేష్ ఐదు సంవత్సరాలుగా వాడుకొని ఇప్పుడు తనను పెళ్లి చేసుకోనంటూ చెప్పడంతో ఆమె బలవన్మరణానికి పూనుకుంది.

IHG

అయితే ఆ వీడియోలో ఆమెను ఓ బజారు మనిషిగా దినేష్ తల్లితండ్రులు చందన తల్లితండ్రులతో అనడంతో అవమానానికి గురైన చందన ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లితండ్రులు ఈ విషయమై పోలీస్ కేసు పెట్టడంతో ఈ జూన్ 1 న ఈ విషయం బయటకు వచ్చింది. ఆ వీడియోలో తాను మోసపోయినట్టు మరెవ్వరు మోసపోకూడదని పోలీసులను వేడుకొంది. కేసు నమోదు చేసే సమయానికి పరారీలో ఉన్న దినేష్ ని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నటి చందనకు న్యాయం చేయాలంటూ ఆమె తల్లితండ్రులు , మహిళాసంఘాలు గట్టిగా అడుగుతున్నాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: