చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నిమొత్తం చుట్టేసింది.  లక్షల్లో మరణాలు... కేసులు నమోదు అవుతున్నాయి. త్వరలో ఇది కోటికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే చైనాలో కరోనా ఉద్రితి తగ్గినా.. ఇతర దేశాల్లో మాత్రం మరణ మృదంగం వాయిస్తుంది. కరోనా భారిన పడి ఎక్కువగా చనిపోయింది అమెరిక ప్రజలే.. ఆ తర్వాత ఇటలి, బ్రిటన్, రష్యా పలు దేశాలు.  దేశంలో కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రంగా ఉన్న మహారాష్ట్ర వైరస్‌ కేసుల సంఖ్యలో చైనాను దాటేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా మూడు వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 85,975కి చేరింది. చైనాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 83,036ను మహారాష్ట్ర అదిగమించినట్లయ్యింది.

 

కరోనాతో మరణించిన వారి సంఖ్య కూడా మూడు వేలు దాటింది. అయితే ఈ సంఖ్య చైనాలో కేసుల సంఖ్య కన్నా ఎక్కువ అని చెబుతున్నారు. ఇక 31,667 కేసులు, 1,515 మరణాలతో తమిళనాడు రెండోస్థానంలో కొనసాగుతున్నది. 28 వేలకుపైగా కేసులు, 800కుపైగా మరణాలతో ఢిల్లీ మూడో స్థానంలో, 19 వేలకుపైగా కేసులు, 1200కుపైగా మరణాలతో గుజరాత్ నాలుగోస్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.5 లక్షలను దాటింది. కేవలం ఐదు రోజుల్లోనే 2 లక్షల నుంచి ఈ సంఖ్యను చేరడం గమనార్హం.  అయితే లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కేసుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: