ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో దేవాలయాలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేవాలయాలను అనుమతి ఇవ్వడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ లో కాస్త కఠినం గానే ఉన్న ప్రభుత్వాలు ఈ నిర్ణయం విషయంలో తప్పటి అడుగులు వేసాయి అని పలువురు అంటున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో ఉన్న వాడపల్లి వెంకన్న దేవాలయంలో అధికారులు భక్తులను అనుమతి ఇస్తున్నారు. దీనిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాతో వచ్చే భక్తులతో గ్రామంలో కరోనా వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ భక్తులను అనుమతించవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: