రెండు రోజుల క్రితం నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం అడ్మిషన్లు చేయించని ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాల్లోంచి తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితేంటని ఉద్యోగులు మీడియాతో తమ గోడును చెప్పుకున్నారు. ఏప్రిల్‌ నెలకు సగం జీతమే ఇచ్చి, మే నెల వేతనాన్ని పూర్తిగా నిలిపివేశారని వారు మీడియాకు తెలిపారు. 
 
ఈ విషయం నెల్లూరు డీఈవో దృష్టికి రావడంతో అడ్మిషన్లు చేయనిదే జీతాలు ఇవ్వలేమని చెప్పిన నారాయణ స్కూల్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. డీఈఓ జనార్దనాచార్యులు స్టోన్‌హౌస్‌పేట నారాయణ స్కూల్‌లో ఉపాధ్యాయులకు అడ్మిషన్లు అప్పజెప్పటం... జీతాలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆదేశించారు. నోటీసులకు రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: