దేశ రాజధాని ఢిల్లీని భూప్రకంపనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో భూమి కంపించగా తాజాగా మరోసారి భూమి కంపించింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 2.1గా నమోదైంది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. స్వల్ప భూ ప్రకంపనలు భారీ భూకంపానికి హెచ్చరికలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
రెండు నెలల వ్యవధిలో ఢిల్లీలో 14 సార్లు భూమి కంపించింది. ధన్ ‌బాద్‌ ఐఐఎంలోని భౌగోళిక, భూకంప శాస్త్ర నిపుణులు దేశ రాజధాని, పరిసర ప్రాంతాలను రానున్న రోజుల్లో భారీ భూకంపం కుదిపేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: