ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర పోలీసులకు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర పోలీసులకు ఇచ్చే జీతభత్యాల నిబంధనలలో భారీ మార్పులు చేసింది. రిలీవింగ్ ఇచ్చి వెయిటింగ్ లిస్ట్ లో ఉండే పోలీసులకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం సగం జీతం మాత్రమే చెల్లించనుంది. పోలీస్ శాఖలో వెయిటింగ్ పీరియడ్ లో ఉంటూ సగం జీతభత్యాలు తీసుకునే పరిస్థితి ఉండదు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగి నుంచి ఐపీఎస్ వరకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి. 
 
వెయిటింగ్ లో ఉన్న కాలానికి తిరిగి పోస్టింగ్ ఇచ్చాక జీతభత్యాలు అందుతాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇకనుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉండే పోలీసులకు సగం జీతభత్యాలు మాత్రమే అందనున్నాయి. పోలీస్ సిబ్బంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని వారు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: