తెలంగాణ రాష్ట్రంలో మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సమర్థవంతంగా డాక్టర్లకు పీపీఈ కిట్లు అందిస్తే  డాక్టర్లు కరోనా  వైరస్ బారిన ఎందుకు పడుతున్నారు అంటూ ప్రశ్నించింది. అదే సమయంలో ఎక్కువ పరీక్షలు ఎందుకు చేయడం లేదు అంటూ ప్రశ్నించింది. 

 

 ఇక తాజాగా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.. ఇప్పటికే ఎంతోమంది హెల్త్ వర్కర్లు డాక్టర్లు కరోనా వైరస్ పేషెంట్ లకి చికిత్స అందిస్తూ  వారు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారని ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా మరింత పరీక్షలను ప్రారంభించాలి అంటూ సూచిస్తున్నారు. చాలామంది వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు ప్రమాదంలో ఉన్నారని.. హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె మహేష్ కుమార్ అన్నారు. పరీక్ష అనేది ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అని ప్రభుత్వం తగిన పరీక్షలు చేయడం లేదు అంటున్నారు పలువురు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: