ఆన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు తగ్గుతున్నా సరే మన దేశంలో మాత్రం పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా రెండోరోజు కూడా పెరిగాయి. జాతీయ చమురు సంస్థ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌ల ధర 60పైసలు చొప్పున పెరిగిందని పేర్కొంది. పెట్రోల్ లీటరు రూ.72.46 పెరగగా... డీజిల్ లీటరు రూ.70.59కి ధరకు చేరుకుందని వ్యాఖ్యానించింది. 

 

ఇక ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు కొంచెం పెరిగాయి. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు చాలా దేశాల్లో వాడకం లేక తగ్గుతూ వస్తున్నా సరే మన దేశంలో పెరగడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వం చెప్పాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: