మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మీడియాతో జగన్ ఏడాది పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లోకేష్ మాట్లాడుతూ బడి, గుడి, మరుగుదొడ్లకు కూడా రంగులేశారని అన్నారు. ఆవ భూముల్లోనే 220 కోట్ల రూపాయల కుంభకోణం చేశారని అన్నారు. జగన్ మడ అడవులను మడత పెట్టేశారని వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు జే ట్యాక్స్ డిమాండ్ చేస్తున్నారని అన్నారు. 
 
ఒక మంచి డాక్టర్ ను దారుణంగా హింసించారని.... చిత్తూరు జిల్లా డాక్టర్ అనితా రాణి మీడియా ముందుకు వచ్చారని... మీరు చేస్తున్న తప్పులను మేం ప్రశ్నించకూడదా...? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశ చట్టం కింద ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఇంటి పేరు అసత్యం... సొంత పేరు అబద్ధం అని ఘాటు విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ మూడు ముక్కల రాజధాని చేశారని చేశారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: