తెలంగాణా సర్కార్ సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణాలో సినిమాల షూటింగ్ లకు టీవీ షూటింగ్ లకు అనుమతులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. సినిమా థియేటర్ లకు మాత్రం అనుమతి లేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  ఇక జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాల షూటింగ్ లను చెయ్యాలి అని పేర్కొంది. 

 

ఇటీవల సినీ పెద్దలు మంత్రి తలసాని తో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా కలిసి తెలంగాణా సినిమాల షూటింగ్ లకు అనుమతులు ఇవ్వాలి అని విజ్ఞప్తులు చేసారు. దీనిపై అన్ని విధాలుగా ఆలోచన చేసిన తెలంగాణా సర్కార్ అనుమతులను ఇచ్చింది. ఇక లిప్ లాక్ లకు హగ్ లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: