తెలంగాణాలో పదో తరగతి పరిక్షల నిర్వహణ సాధ్యం అయ్యే అవకాశాలు లేని  నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కీలక అడుగు వేసినట్టు సమాచారం. తెలంగాణాలో కరోనా ఉన్న నేపధ్యంలో విద్యార్ధులను పై తరగతులకు పంపించాలి అని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. పదోతరగతి విద్యార్థుల్ని అప్‌గ్రేడ్ చెయ్యాలని కేసీఆర్ భావిస్తున్నారు. 

 

టెన్త్ విద్యార్థుల ఎస్ఏ-1, ప్రీ ఫైనల్,  ఇంటర్నల్ మార్కుల జాబితాలను సిద్ధంగా  ఉంచాలి అని ఆదేశాలు ఇచ్చింది విద్యాశాఖ. పదోతరగతి పరీక్షల నిర్వహణపై సిఎం కేసీఆర్ ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రద్దు మంచి ఆలోచన అని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: