ఈ మధ్య వందేళ్ళు బ్రతకడం అంటే కాస్త వింత అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంద ఏళ్ళు బ్రతకాలి అంటే ఎంతో రాసి పెట్టి ఉండాలి అని అంటారు చాలా మంది. అవును ప్రస్తుతం వాతావరణం పరిస్థితులు, ఆరోగ్య అలవాట్లు చూస్తే బ్రతకడం కాస్త కష్టమే. ఇక వందేళ్ళు బ్రతికిన వాళ్ళను దేవుళ్ళుగా చూసే పరిస్థితి కూడా ఉంది. 

 

తాజాగా ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి వందేళ్ళ పుట్టిన రోజుని జరుపుకున్నారు. రిటైర్డ్ వారెంట్ ఆఫీసర్ పిడి పాండియన్ తన 100 వ పుట్టినరోజు వేడుకలకు వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియాను ఆహ్వానించారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు కార్డుతో పాటుగా కేకును త్రివేండ్రం లోని ఐఎఎఫ్ అధికారులు రిటైర్డ్ వారెంట్ అధికారికి అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: