దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా విజృంభణ ప్రభావం వివాహాలపై పడింది. మొదట్లో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడం వల్ల వివాహాలు వాయిదా పడ్డాయి. వైరస్ వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతో తర్వాత కేవలం 50 మందితో అతిధులు మాత్రమే హాజరు కావడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. 
 
కానీ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో పెళ్లిళ్లు చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా వ్యాప్తి తగ్గే వరకు వివాహాలను వాయిదా వేయడమే మంచిదని దేశంలోని చాలా కుటుంబాలు ఆలోచిస్తున్నాయి. మరోవైపు పెళ్లిళ్లు ఆగిపోవడంతో పరోక్షంగా వివాహాలపై ఉపాధి పొందుతున్న వారు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా విజృంభణ వల్ల వారు కూడా ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: