దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఢిల్లీలో ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేఎస్‌ ధత్వాలియా కరోనా భారీన పడ్డారు. ఆయనకు కరోనా సోకడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - జాతీయ మీడియా కేంద్రం మూతపడింది. బుధవారం రోజున మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్‌తో కలిసి ధాత్‌వాలియాతో కలిసి వేదిక పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం కేంద్ర మంత్రులు టెన్షన్ పడుతున్నారు. 
 
ఆ రోజు మీడియా సమావేశాలకు వచ్చిన వారందరినీ హోమ్ క్వారంటైన్ చేయాలని నిర్ణయించామని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో నిన్న రాత్రి 7 గంటలకు ఆయనను చేర్పించారు. అయితే ధాత్ వాలియాకు వైరస్ సోకిందో తెలియాల్సి ఉంది. ఎన్ఎంసీ భవన్ పూర్తిగా శానిటైజేషన్ చేసిన తర్వాత.. తెరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: