నేపాల్‌కు భార‌త్ మ‌రోసారి సాయం అందించింది. ఆ దేశంలోని 56 ఉన్నత పాఠశాలల పునర్నిర్మాణానికై ఆర్థిక సాయం అందించేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. భూకంపాల తాకిడి కారణంగా శిథిలావస్థకు చేరిన 7 జిల్లాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు 2.95 బిలియన్‌ నేపాలీ రూపాయల గ్రాంట్‌ ప్రకటించింది.

 

ఈ మేరకు.. *నేపాల్‌లోని గోర్ఖా, నౌవాకోట్‌, ధాడింగ్‌, డోలఖా, కావ్రేపాలన్‌చౌక్‌, ఆమెచాప్‌, సింధుపాల్‌చౌన్‌ జిల్లాల్లోని 56 పాఠశాలల పునర్నిర్మాణానికై... భారత రాయబార కార్యాలయం, నేపాల్‌ విద్యాశాఖకు చెందిన సెంట్రల్‌ లెవల్‌ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌(సీఎల్‌పీఐయూ) మధ్య ఏడు ఎంఓయూలు కుదిరాయి* అని నేపాల్‌లోని ఇండియన్‌ మిషన్ వెల్ల‌డించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: