మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విధ్వంసం కొన‌సాగుతోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో వైర‌స్‌కు కేంద్ర‌బిందువు అయిన చైనా దేశాన్ని దాటిపోయింది.  చైనాలో సోమవారం వరకు 83,040 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో కేసుల సంఖ్య 85,975కు చేరడం గ‌మ‌నార్హం.  చైనాలో 78,341 మంది కరోనా బాధితులు కోలుకోగా,  మహారాష్ట్రలో 39,314 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 43,601 ఉన్నాయి. చైనాలో కేవలం 65 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 

చైనాలో 4,634 మంది కరోనాతో మరణించగా, మహారాష్ట్రలో 3,060 మంది చనిపోయారు. కాగా, మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే ఏకంగా 3,007 మందికి కరోనా సోకింది. ఇక వాణిజ్య రాజ‌ధాని ముంబైలో కరోనా కేసుల సంఖ్య 48,774కు చేరింది. ఇందులో 21,190 మంది చికిత్సతో కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం నగరంలో యాక్టివ్‌ కేసులు 25,940 ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: