దేశ రాజధాని ఢిల్లీ లో వరుస భూకంపాలు ఇప్పుడు కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. భూకంపాల విషయంలో అక్కడి ప్రజలు కాస్త భయపడుతున్నారు. చిన్న చిన్న భూ కంపాలే వచ్చినా ఎప్పుడు పెద్దవి వస్తాయో అనే ఆందోళన జనాల్లో ఉంది. ఢిల్లీ సమీపంలో సోమవారం తేలికపాటి భూకంపం సంభవించింది. 

 

రోహ్తక్ తూర్పు ఆగ్నేయంలో మధ్యాహ్నం 1 గంటలకు 2.1 మాగ్నిట్యూడ్ గా నమోదు అయింది. ఏప్రిల్ నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో నమోదైన 16 వ భూకంపం ఇది. గౌతమ్ బుద్ నగర్ సమీపంలో బుధవారం రాత్రి ఢిల్లీలో కనీసం 14 భూకంపాలు నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీకి చెందిన అధికారులు చెప్తున్నారు. ఇవి అన్నీ కూడా స్వల్ప భూకంపాలే.

మరింత సమాచారం తెలుసుకోండి: