భారత్ - చైనా సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొందని, ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని చైనా సోమవారం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య మంచి వాతావరణాన్ని కొన‌సాగించ‌డానికి కలిసి కృషి చేస్తామని ఆదేశం ప్రకటించింది.

 

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ భార‌త‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జిన్ పింగ్ లు అంగీక‌రించిన ఏకాభిప్రాయాన్ని అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, సరిహద్దులో స్థిరంగా శాంతియుత‌ పరిస్థితిని కృషి చేయాలని సూచించింది.  ఇటీవ‌ల రెండు దేశాల స‌రిహ‌ద్దులో అధికారులు చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: