ఈ మధ్యకాలంలో చిరుతలు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతోన్నాయన్న  విషయం తెలిసిందే. ఏకంగా జనావాసాల్లోకి రావడమే కాదు జనాల పై దాడి కూడా చేస్తున్నాయి. అయితే హైదరాబాద్లో ఇటీవల కలకలం రేపిన చిరుత మళ్ళీ కనిపించదు. రాజేంద్రనగర్ లోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో ఇది సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇంటికి నుంచి కిటికీ నుండి తొంగి చూస్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలు రికార్డయివ్వటంతో  అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

 

 ఈ ప్రాంత ప్రజలు మొత్తం ఎక్కడ చిరుత తమ  పై దాడి చేస్తోందోనని  భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చిరుతను పట్టుకొని... తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులిని అటవీశాఖ అధికారులు కూడా గత రెండు నెలలుగా పట్టుకునేందుకు  ప్రయత్నాలు చేస్తున్న ఎక్కడ ఫలితం మాత్రం దక్కడం లేదు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: