దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఎప్పుడు... ఎక్కడ... ఎవరి నుంచి కరోనా సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా డబ్ల్యూహెచ్వో కరోనా గురించి శుభవార్త చెప్పింది. ఎలాంటి లక్షణాలు లేని వారి నుంచి కరోనా సోకదని కీలక ప్రకటన చేసింది. లక్షణాలు లేని వారి నుంచి కరోనా సోకడం అరుదుగా జరుగుతుందని పేర్కొంది. 
 
నిపుణులు లక్షణాలు లేని వారి నుంచి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణం డబ్ల్యూహెచ్వో చేసిన ప్రకటన శుభవార్త అనే చెప్పవచ్చు. కరోనా లక్షణాలు లేని బాధితుల నుంచి ఇతరులకు చాలా స్వల్ప స్థాయిలోనే సోకుతోందని, గరిష్ఠంగా ఇది 6% వరకూ ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం ఉన్నతాధికారి మారియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: