టీడీపీ జాతియ ప్రధాన కార్యదర్శి నారా లోకేష పై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యేగా గెలవలేని నారా లోకేష్‌ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ గురించి మాట్లాడటమా..? అని ఎద్దేవా చేసారు. సోమవారం జగన్ పై లోకేష్ తీవ్ర విమర్శలు చేసారు. దీనిపై స్పందించిన అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఓడిన లోకేష్‌కు అధ్యక్ష పదవి ఎందుకు? అని ప్రశ్నించారు. అసలు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎలా కొనసాగుతారు..? నిలదీసారు.


లోకేష్ నాయకత్వంలో నడుస్తామని ఒక్క ఎమ్మెల్యేతోనైనా చెప్పించగలరా? అని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో లోకేష్‌ ఎందుకు పర్యటించలేదన్నారు. జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే విధ్వంసంలా కనిపిస్తోందా? అని ప్రశ్నించారు. జగన్‌ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయన్న ఆయన జగన్‌ పలుకుబడి పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఏడాది లోనే ప్రభుత్వం ఇచిన హామీలను అన్ని అమలు చేసిందన్నారు. దేశంలో ఎవరూ జగన్‌లాగా పరిపాలన చేయలేదని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: