ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇప్పటికే పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే, ఇప్పటికే ఆరోగ్యశ్రీ కార్డుల పేరిట ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు అంతే కాకుండా మరెన్నో వ్యాధులను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చి సామాన్య ప్రజలకు ఎక్కడ వైద్యం భారం  కాకూడదనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 


 ఇక తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందేలా చేయటమే  తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు. అర్హులందరికీ 20 రోజులో ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ అందిస్తామని... తద్వారా పేద ప్రజల తమకు కావాల్సిన వైద్యాన్ని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో  కూడా పొందవచ్చు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: