గత కొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్ కేంద్రంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చి పోతున్నారు.  ఎన్ని సార్లు భారత ఆర్మీ బుద్ది చెప్పినా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పపడుతూనే ఉన్నారు . గత ఏడాది పుల్వామా దాడికి ప్రతి దాఢి చేసి ఉగ్రమూకలను మట్టు పెట్టారు భారత సైనికులు.  ఇటీవల పుల్వామా తరహా మరో దాడికి యత్నించారు.. కానీ దాన్ని కూడా తిప్పికొట్టారు.   ఇప్పటికే రెండు వారాల్లో తొమ్మిది భారీ ఆపరేషన్లు చేపట్టిన భద్రతా బలగాలు.. ఆరుగురు ఉగ్రవాద అగ్రశేణి కమాండర్లతో పాటు మొత్తం 22 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. 

IHG

 

ఈ రోజు పూంఛ్‌ జిల్లాలోని మంధర్‌ ప్రాంతంలో చొరబాట్లకు యత్నించిన మరో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా బలగాలు జరుపుతోన్న ఆపరేషన్‌ విజయవంతమవుతోంది. గత కొద్ది రోజులుగా పూంఛ్‌ జిల్లాలోని మంధర్‌ ప్రాంతంలో చొరబాట్ల ఉగ్రమూకలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ సమయంలోను కాల్పులకు పాల్పపడుతున్నారు. ఈ క్రమంలోనే  ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.  

IHG

అందులో  మరో నలుగురు ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. వారిని కూడా హతమార్చడానికి భద్రతా బలగాలు గాలింపు ప్రారంభించాయి. హతమైన ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కుట్రలను భద్రతా బలగాలు సమర్థవంతంగా భగ్నం చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: