దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఈ వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేరు. దేశంలో వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటంతో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు కరోనా సోకకుండా ఉండేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసేందుకు వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. అధికారులు ఆటోమాటిక్ బుల్లెట్ థర్మల్ స్క్రీనింగ్ ఇమేజ్ డిటెక్ట్ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. 
 
సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో తొలిసారిగా అధికారులు వీటిని ఉపయోగించనున్నారు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఒకేసారి పది మంది ఉష్ణోగ్రతలు తెలుసుకునే అవకాశం ఉంది. డిటెక్ట్ చేసిన వ్యక్తుల వివరాలు నెల రోజుల పాటు నిక్షిప్తం చేయవచ్చు. రైల్వేలో ప్రయాణించే కరోనా పేషంట్లను గుర్తించేందుకే ఇది ఉత్తమ పద్ధతి అని అధికారులు భావిస్తున్నారు. రైల్వే సీపీఆర్‌వో రాకేష్ ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: