కరోనా వైరస్ గురించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఆగ‌స్టులోనే క‌రోనా ఆన‌వాళ్లు బయటపడ్డాయని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లోనే ప్ర‌పంచానికి కరోనా గురించి తెలిసినప్పటికీ వైర‌స్‌ విజృంభణ అంతకుముందే మొదలైందని.... ఆగ‌స్టు నుంచే క‌రోనా ఉనికి ప్రారంభ‌మైంద‌ని.... హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. 
 
కిక్కిరిసిన ఆసుప‌త్రులు - పార్కింగ్‌, అక్క‌డి జ‌నాభా సెర్చ్ ఇంజిన్‌లో వెతికిన ప‌దాల ఆధారంగా హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ ఈ ప్రకటన చేసింది. 2019లోని శాటిలైట్ ఫోటోలలో వూహాన్‌లో ఆసుప‌త్రుల ద‌గ్గ‌ర జ‌నాల‌ ర‌ద్దీ అధికం‌గా క‌నిపించింద‌ని... అనూహ్య రీతిలో పార్కింగ్ స్థ‌లం కూడా నిండిపోయింద‌ని.... క‌రోనా ముఖ్య ల‌క్ష‌ణ‌మైన‌‌ ద‌గ్గుతో పాటు విరేచ‌నాలు వంటి ప‌దాల‌ను గూర్చి ఎక్కువగా సెర్చ్ ఇంజిన్ లో వెతికారని పేర్కొంది. దీంతో అప్ప‌టి నుంచే వైర‌స్ వ్యాప్తి ప్రారంభమైంద‌ని హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్ అభిప్రాయపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: