ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. ఏపీలో సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలను సిఎం జగన్ తో చర్చిస్తున్నారు. చిరంజీవి సురేష్ బాబు అదే విధంగా నాగార్జున సి కళ్యాణ్ వంటి వారు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో సినీ పరిశ్రమకు ఇచ్చే రాయితీలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. 

 

అదే విధంగా జగన్ సినిమాల షూటింగ్ కి దాదాపుగా అనుమతి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమాల షూటింగ్ కి రాయితీలు కోరినట్టు వార్తలు వస్తున్నాయి. మరి జగన్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. తెలంగాణా ఇప్పటికే సినీ పరిశ్రమకు అనుమతులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: