కరోనా విషయంలో హార్వార్డ్ మెడికల్ స్కూల్ కీలక వ్యాఖ్యలు చేసింది. గతేడాది ఆగస్ట్ నెలలోనే చైనాలో వైరస్ వ్యాప్తి మొదలైనట్టు పరిశోధనలో వెల్లడి అయిందని సంచలన ప్రకటన చేసింది. శాటిలైట్ ఫొటోలు, సెర్చ్ ఇంజిన్ డేటా ప్రకారం తమకు ఈ విషయం తెలిసిందని పేర్కొంది. 

 

వూహాన్‌లో కరోనా వైరస్ డిసెంబర్ నెలలో మొదలైనట్టు చైనా చెప్పిన మాట అవాస్తవం అని స్పష్టం చేసింది. వూహాన్‌లో అక్కడి ప్రజలు డిసెంబర్ నెల కంటే ముందు నుంచే దగ్గు, డయేరియా వంటి వ్యాధుల గురించి సెర్చ్ చేసారని పేర్కొంది. ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య కూడా ఆగస్ట్ నుంచే గణనీయంగా పెరిగిందని పేర్కొంది. దీనిపై స్పందించిన చైనా ట్రాఫిక్ వాల్యూమ్‌ను ఆధారంగా చేసుకుని వైరస్ ఆగస్ట్‌లోనే వ్యాప్తి చెందిందని చెప్పడం కామెడి గా ఉందని వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: