పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.   గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్‌ అసెస్మెంట్‌ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను పైతరగతికి ప్రమోట్‌ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పుడు తెలంగాణ బాటలోనే తమిళనాడు కూడా నడిచింది.

 

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నామని, విద్యార్థులు నేరుగా తర్వాతి తరగతికి ప్రమోట్ అవుతారని పళనిస్వామి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు.  తాజాగా ఇప్పుడు కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

 

పబ్లిక్ పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు తర్వాతి తరగతులకు ప్రమోట్ అవుతారని సీఎం నారాయణస్వామి వెల్లడించారు. కాగా, పుదుచ్చేరిలో ఇప్పటివరకు 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 36 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: