కరోనా వైరస్ నేపధ్యంలో ఎవరూ కూడా తన పుట్టిన రోజు వేడుకలను జరపవద్దు అని నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వ నిబంధనలు ఆంక్షలు భౌతిక దూరం పాటించడం మనందరి కర్తవ్యం అని అందుకే అందర్ని కలవాలి అనే ఆకాంక్షకు అడ్డు కట్ట వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని  లేఖ విడుదల చేసారు. దయచేసి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరూ కూడా తనను కలవడానికి రావొద్దు అని ఆయన విజ్ఞప్తి చేసారు. 

 

పుట్టిన రోజు నాడు తాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న  చిత్రం టీజర్ మరియు పాట విడుదల అవుతున్నాయని ఆస్వాదించండి ఆశీర్వదించండి అని కోరారు. ఈ సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం తన బాధ్యత అని బాలయ్య అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: