తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసి బస్సులు నడుస్తున్నా హైదరాబాద్ లో మాత్రం సిటీ బస్సులు నడిచే పరిస్థితి కనపడటం లేదు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బస్సులను హైదరాబాద్ లో నడిపే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది. దీనిపై కేసీఆర్ కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు. 

 

తాజాగా ఆయన ఆర్టీసి అధికారులతో సమావేశం అయ్యారు. బస్సులను నడిపే విషయమై ఆయన వారితో చర్చిస్తున్నారు. దీనికి ఆర్టీసి నుంచి కీలక అధికారులు హాజరయ్యారు. అధికారుల అభిప్రాయాలను ఈ సందర్భంగా కేసీఆర్ తీసుకుంటున్నారు. కంటైన్మేంట్ ప్రాంతాల్లో వద్దు అని అధికారులు అంటున్నారు. అసలు వద్దు అని కేసీఆర్ అంటున్నారు. ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయని అప్పటికి ఇంకా ప్రమాదం వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: