దేశంలో ఈ మద్య జరగుతున్న ప్రమాదాలు చూస్తుంటే.. ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి చేరుతామా లేదా అన్న భయం నెలకొంటుంది.  అయితే కరోనా బీభత్సం అంతా ఇంతా కాదు.. దానికి తోడు తుఫాన్లు ఒకటి మనిషికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసోం రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లాలో న్యాచురల్ గ్యాస్‌ ఉత్పత్తి చేసే ఆయిల్ ఇండియా లిమిటెడ్ బావిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బావిలో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. మే-27న గ్యాస్ లీక్ అవడం ప్రారంభమై గత 14 రోజులుగా పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అవుతున్న విషయం తెలిసిందే.

 

అసోం రాజధాని గౌహతికి 500 కిలోమీటర్ల దూరంలోని బాఘ్‌జాన్ వద్దనున్న ఈ చమురు బావి నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. ఇక్కడ గత 14 రోజులుగా గ్యాస్ లీక్ అవుతున్నప్పటి నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సిద్ధంగా ఉన్నారు. ఉన్నతాధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిప్రమాదం మొదలైన వెంటనే అసోం సీఎం సర్బానంద సోనోవాల్.. కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను వివరించారు.

 

సింగపూర్‌కు చెందిన వెల్ కిల్లింగ్ నిపుణులు లీకేజీని అరికట్టేందుకు సోమవారం ఇక్కడికి వచ్చారు. వీరు ప్రయత్నాలు మొదలెట్టిన మరుసటి రోజే మంటలు చెలరేగాయి.  మంటలు ఎగిసి పడిన సమయంలో సింగపూర్‌ నిపుణులు చమురు బావి వద్ద లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: