దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా ఢిల్లీ లో ప్రతీ రోజు వందల్లో కేసులు ఉంటున్నాయి. ఇక తాజాగా ఆ రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

 

డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ జూలై 31 నాటికి ఢిల్లీలో కోవిడ్ 19 కేసులు 5.5 లక్షలు  దాటే అవకాశం ఉందని... జూలై 31 నాటికి 80,000 పడకలు అవసరమవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ వారి కోసమే పడకలను రిజర్వ్ చేయాలన్న ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: