నందమూరి బాలకృష్ణ జూన్ 10న తన 60 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సోషల్ మీడియా  మొత్తం పండగ వాతావరణం కనిపిస్తోంది. బాలయ్యకు జూన్ 5 నుండే అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. మంగళవారం బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో వస్తున్నా మూడవ సినిమాకు సంబంధించి #BB3 ఫస్ట్ రోర్ ని విడుదల చేసారు.  #BB3 ఫస్ట్ రోర్ పై విపరీతమైన ఆదరణ మరియు  అభిమానులనుండి గొప్ప స్పందన లభిస్తోంది.

 

ఇప్పటికే   #BB3 ఫస్ట్ రోర్ వన్ మిల్లియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. మున్ముందు రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బోయపాటి మరియు బలకృష్ణ కంబోలో ఇప్పటికే లెజెండ్ , సింహ  సినిమాలు భారీ విజయాలను మరియు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇది వీరి కాంబో  లో వస్తున్నా మూడవ సినిమా కావడంతో ఈ  #BB3 ఫస్ట్ రోర్ తో మరో హిట్ కన్ఫార్మ్ అంటున్నారు. ట్రైలర్ లో ఎవరిని ఉద్దేశించి బాలయ్య బాబు ఆ డైలాగులు అన్నారు అన్నదానిని పక్కన పెడితే ట్రైలర్ మాత్రం ఇరగదీసాడు బాలయ్య ..దింతో ఇండస్ట్రీ హిట్ ఖాయం అంటున్నారు అభిమానులు 

 

మరింత సమాచారం తెలుసుకోండి: