నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 11ను కొట్టేయాలని గుంటూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి కో వారెంట్‌ రూపంలో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.ఎస్‌ఈసీ నియామకం రాష్ట్ర మంత్రి మండలి సిఫార్స్ మేరకు జరగడానికి వీల్లేదని.. పూర్తిగా రాష్ట్ర గవర్నర్‌ విచక్షణ మేరకే జరగాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

 

దీంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు ఎన్నో మలుపుల మధ్య రేపు విచారణ జరుపుకోనుంది. ఈ కేసు ని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించ నుంది. ధర్మాసనంలో సభ్యులుగా సుప్రీంకోర్టు  ప్రధాన యమూర్తి బాబ్డే, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హృషికేష్ రాయ్ లు ఉన్నారు. అయితే ఈ విచారణలో రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై కూడా విచారణ జరపనున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: