లాక్ డౌన్ వేళా సినిమా పరిశ్రమ కుదుపులకు గురైంది. తిరిగి ప్రారంభించడానికి అనుమతులు లేక దాదాపు మూడు నెలలు కాలం గడపవలసి వచ్చింది. తెలంగాణ లో సీఎం కేసీఆర్ సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమా షూటింగ్స్ ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమైయ్యారు.

 

అయితే ఈ సమావేశం లో సినిమా షూటింగ్స్ కోసం అనుమతులు సీఎం జగన్ ను కోరినట్లు సినీ ప్రముఖులు తెలియజేసారు. అయితే ఏపీ లో సినిమా షూటింగ్స్ ప్రారంభించడానికి ఎటువటిని అభ్యన్తరం లేదని మరియు సినిమా షూటింగ్ లను యథేచ్ఛగా చేసుకోవచ్చని అయన తెలిపారని  వారు చెప్పారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్స్ ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చినందుకు ఏపీ సీఎం కి కృతజ్ఞతలు తెలియజేసారు సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి. అదేవిధంగా థియేటర్ యజమానులను దెబ్బతీసిన ప్రపంచ సంక్షోభ సమయంలో పరిశ్రమకు ఆశలు కల్పించినందుకు మరియు థియేటర్లలో కనీస స్థిర విద్యుత్ ఛార్జీలను మాఫీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని తెలిజేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: