తాజగా టాలీవుడ్ లో జరుగుతున్న వ్యాఖ్యల దుమారం టాలీవుడ్ లో అంతర్ తగాదాలు ఉన్నాయని తెలుపకనే తెలుపుతున్నాయి. దీనికి నిలువెత్తు సాక్ష్యం టాలీవుడ్ సినీ ప్రముఖులు మూవీ షూటింగ్ పర్మిషన్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలవడానికి వెళ్లేప్పుడు నందమూరి బాలక్రిష్ణని పిలువలేదన్న కారణంతో బాలయ్య ...విలేకరులు ఈ విషయమై బాలయ్యను అడిగినప్పుడు...తనకు ఆ విషయం గురించి నాకేమి తెలియదు . వారు నన్ను సంప్రదించలేదు ...ఒకవేళ భూములు పంచుకోవడానికి వెళ్ళుండొచ్చు అంటూ ఘాటుగా స్పందించారు...దానికి చిరంజీవి సోదరుడు నాగబాబు కౌంటర్ కూడా ఇచ్చారు...

 

అయితే ఈ విషయం సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ ...లోలోపల కారుచిచ్చులా మారిందని అందరు అనుకుంటున్నారు...అయితే  విలేకరి సురేష్ కొండేటి ..బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా  ఓ పోస్ట్ ని పెట్టారు ..ఆ ఫోటో చూడడానికి చాల ఆహ్లదకరం గా అనిపించింది..అయితే ఇది చూసినవారికి టాలీవుడ్ సినీ హీరోలు , దర్శక నిర్మాతలు ఇలా ఉంటె ఎంత మంచిగా ఉంటుందో అన్న ఆలోచన రాక మానదు. తప్పకుండా టాలీవుడ్ లో అందరు తమ ఇగో లను పక్కన బెట్టి ఈ దృశ్యం లో కనిపిస్తున్నట్లు ఉంటారని ఆశిద్దాము ...మరోసారి బాలయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు ...

 

మరింత సమాచారం తెలుసుకోండి: