స్టార్ హీరో నంద‌మూరి బాలకృష్ణ నేడు 60వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా గ‌త కొన్ని రోజుల నుంచే అభిమానులు సంద‌డి చేస్తున్నారు. అయితే.. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని అభిమానుల‌ను బాల‌య్య సూచించారు. ఇదిలా ఉండ‌గా.. బాల‌య్య‌, దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా  ‘ఫస్ట్‌ రోర్‌' పేరుతో సినిమాలోని ఆయన లుక్‌ను నిన్న‌ చిత్రబృందం విడుదలచేసింది.

 

ఇందులో పంచెకట్టులో మీసాన్ని మెలితిప్పుతూ మాస్‌ లుక్‌లో బాలయ్య కనిపిస్తున్నారు.“సింహా’, ‘లెజెండ్‌' విజయాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటికి తగినట్లుగానే విభిన్నమైన కథ, కథనాలతో  భారీగా ఈ సినిమా తెరకెక్కుతోంది’ అని చిత్రబృందం తెలిపింది.   ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: