మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు.   తాజాగా బైక్ పై వెళుతున్న ఓ మహిళ తన ముఖానికి కట్టుకున్న మాస్క్, బండి వెనుక చక్రంలోకి ఇరుక్కుని కిందపడేయటంతో దుర్మరణం పాలైంది.  ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ సమీపంలో జరిగింది.  విజయవాడ రూరల్ మండల పరిధిలోని పైడూరుపాడుకు చెందిన మాలన్ బీ (45) లాక్ డౌన్ కు ముందు కొత్తగూడెంలో ఉన్న తన అన్నయ్య ఇంటికి వెళ్లింది. లాక్ డౌన్ కారణంగా అక్కడే కొంత కాలం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సడలింపులు లభించిన తరువాత, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది.   ఈ క్రమంలో ఆమె సోదరుడు   అల్లుడు గపూర్ నందిగామ బయలుదేరగా, తాను కూడా అక్కడి వరకూ వచ్చి, ఆపై బస్సులో వెళ్తానని చెప్పి బయలుదేరింది. 

 

ఇలా వారు బయలు దేరిన కొంత సమయానికి తల్లాడ సమీపంలోకి వాహనం రాగానే, మాలన్ బీ ముఖానికి చుట్టుకుని ఉన్న స్కార్ఫ్ ప్రమాదవశాత్తూ, వెనుక చక్రంలోకి ఇరుక్కుంది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడగా, వెనుకు కూర్చున్న మాలన్ బీ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించింది.

 

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. స్కార్ఫ్ కట్టుకున్న వాళ్లకు, చున్నీలు ధరించిన వారికి ఎన్నో మార్లు ట్రాఫిక్ అధికారులు తగు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు.. కొద్ది పాటి నిర్లక్ష్యం ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: