గోదావరి జలాలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నాయి. ఈ నేపధ్యంలోనే గోదావరి జలాలకు మంత్రి కేటిఆర్ స్వాగత హారతి ఇచ్చారు. ముస్తాబాద్ మండల౦ బంధన కల్ గ్రామానికి గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటిఆర్ గోదావరి జలాలు జిల్లాకు రావడంపై హర్షం వ్యక్తం చేసారు. 

 

ఆయన ఈ సందర్భంగా అక్కడి నాయకులతో కూడా చర్చించారు. రైతులు అందరూ కూడా సంఘటితం కావాలని ఆయన అన్నారు. చెరువులు బాగుంటే అన్ని వర్గాలు బాగుంటాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని అన్నారు. రైతులకు మద్దతు ధరకు మించి పైసలు రావాలి అనే  కేసీఆర్ నియంతృత్వ పంటలను మొదలుపెట్టారు అని అన్నారు. భూగర్భ జలాలు బాగా పెరిగాయి అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: