నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు బాలయ్యకు పుట్టిన రోజు విష్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకి అభిమానులు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బాలయ్యకు విష్ చేసారు. ఇంటికి వెళ్ళిన ఆయన ట్విట్టర్ లో కూడా శుభాకాంక్షలు చెప్పారు. 

 

నటన అయినా, ప్రజాసేవ అయినా... చేసే పనిలో నూటికి నూరుపాళ్ళు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణ గారు అని కొనియాడారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారన్నారు చంద్రబాబు. బాలకృష్ణ గారు అరవై వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆయనకు షష్టి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలని వ్యాఖ్యానించారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: