తెలంగాణాలో భూగర్భ జలాలు ఆరు మీటర్ల పెరిగాయని రాష్ట్ర మంత్రి కేటిఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లాకు గోదావరి నీళ్ళు చేరిన సందర్భంగా ఆయన స్వాగత హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణాలో హరిత, క్షీర, నీలి విప్లవాలు రానున్నాయి అని అన్నారు. గోదావరి గమనాన్నే మార్చేసిన ఘనత సిఎం కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. 

 

సిరిసిల్ల జిల్లాలో 665 చెరువులు అన్నీ కూడా నిండుతాయని ఆయన స్పష్టం చేసారు. గోదావరి నీళ్ళు ప్రతీ ఇంటికి చేరతాయని అన్నారు. చెరువులు బాగుంటే అన్నీ బాగుంటాయని  ఆయన అన్నారు. 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో నీళ్ళు నిండలేదు అని, కాని ఆరేళ్ళ పాలనలో కేసీఆర్ నింపారు అని అన్నారు. చెరువులు నిండటం చూసి ఓర్వలేక ఆరోపణలు కాంగ్రెస్ చేస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: