ప్రపంచంలో కరోనా ఎంత వినాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  ప్రపంచం మొత్తం మరణించిన వారి సంఖ్యలో మూడో వంతు ఒక్క అమెరికాలోనే ఉందంటే అర్థం చేసుకోవొచ్చు.  మార్చి నుంచి మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత అంతర్జాతీయంగా విమాన సర్వీసులుమొత్తం మూత పడ్డాయి. ఇక కరోనా లాక్‌డౌన్ కారణంటా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు, ప్రసాస భారతీయ సంఘాలు కూడా ప్రయత్నిస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో ఈ నెల 14న రాత్రి 450 మంది ప్రయాణికులతో న్యూజెర్సీలోని నేవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే విమానం 16న హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటుంది.  యూఎస్–ఇండియా సాలిడారిటీ మిషన్(యూస్ఐఎస్ఎం) ఈ విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. అమెరికాలోని భారత ఎంబసీ కూడా దీనికి ఆమోదం తెలిపింది. టికెట్ ధర రూ. 1.66 లక్షల నుంచి రూ. 1.81 లక్షల మధ్య ఉంది.  www.usism.org/registerprivatecharterflight.html  వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: