తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ బిల్లులు సామాన్యులకు భారీ షాకులు ఇస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు నెలల కరెంట్ బిల్లు ఒకేసారి ఇచ్చారు. ఈ బిల్లులు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. రాష్ట్రంలో ఓ మొబైల్ షాపుకు ఏకంగా రూ. 12 లక్షలు కరెంట్ బిల్లు వచ్చిన ఘటన మరవక ముందే తాజాగా మరో వ్యక్తి ఇంటికి 7 లక్షలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. మూడు బల్బులు, ఓ ఫ్యాన్ ఉన్న ఇంటికి 7 లక్షల బిల్లు రావడంతో బాధితుడు షాక్ కు గురయ్యాడు. 
 
కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటికి ఏకంగా రూ. 7 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. భారీ మొత్తంలో కరెంట్ బిల్లు రావడంతో షాక్ అవ్వడం బాధితుడి వంతయింది. ఫిబ్రవరిలో 414 రూపాయలు కరెంట్ బిల్లు చెల్లించిన శ్రీనివాస్ రూ. 7 లక్షల కరెంట్ బిల్లు రావడంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులను సంప్రదించాడు. అధికారులు టెక్నికల్ గా ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: