చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ అనితా రాణి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ నేత దాడి చేశారని అనితా రాణి ఆరోపణలు చేయడంతో ఏపీ ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అనితా రాణి సీఐడీ విచారణకు సహకరించడం లేదు. అధికారులు ఫోన్ చేసినా ఆమె ఫోన్ కాల్స్ కు స్పందించటం లేదు. దీంతో సీఐడీ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. 
 
సీఐడీ అధికారులను చుసిన వెంటనే అనితా రాణి ఇంటి తలుపులు వేసుకున్నారు. "నాకు సీఐడీ పోలీసులపై నమ్మకంలేదు. నన్ను విచారించడానికి మీరు ఎవరూ కూడా నా ఇంటి వద్దకు రాకండి. మీరు పిలిచినా నేను రాను. నా కేసు సీబీఐతో విచారించాల్సిందే.. " అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 22వ తేదీన  భరత్‌ అనే వ్యక్తి వైద్యం కోసం రాగా వైద్యం చేయకుండా అనితారాణి తలుపులు వేసుకోవడంతో గ్రామస్తులు ఆమెను నిలదీశారు. తనను కులం పేరిట ధూషించారని, బాత్‌రూమ్‌లో ఉంటే ఫొటోలు తీశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోగి భరత్ వైసీపీ నేత అని ఆమె ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: