మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత చంద్రబాబు రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని సీఎం జగన్ నిలబెట్టుకోలేదని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పి జగన్ ద్రోహం చేశారని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఈరోజు టీడీపీ నేతలతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై జగన్ రాజకీయ కక్ష సాధిస్తున్నారని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారని విమర్శలు చేశారు. 
 
జగన్ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు. బాబాయి హత్య కేసు, కోడి కత్తి కేసుపై ఏడాది గడచినా ఎలాంటి చర్యలు లేవని విమర్శలు చేశారు. వృద్దులు, మహిళలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వైసీపీ వేధిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని.... తప్పుడు కేసులతో ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: