తెలంగాణకు మిడతల దండు ప్రభావం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణా రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలో ని రాంటెక్ వద్ద గల అజ్ని అనే గ్రామంలో ఉన్నాయని తెలంగాణా సిఎం కేసీఆర్ కి అధికారులు వివరించారు. నేడు ప్రగతి భవన్ లో ఆయన మిడతల దండు మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. 

 

గాలి ఇటు వాపు వీచే అవకాశం ఉందని అధికారులు సిఎం కేసీఆర్ కి చెప్పారు. దీనితో 8 జిల్లాలకు మిడతల దండు ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు మిడతల దండు ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి 20 లోపు మిడతలు వచ్చే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: