కేరళ మాజీ క్రికెటర్  కె.జయమోహన్‌ తంపి(64) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయితే ఈ వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ కేసులో నిందితుడు అయన కుమారుడు అశ్విన్ కారణమని పోలీసులు విచారణద్వారా తెలుసుకున్నారు. అయితే ఈ విషయమై పోలీసులు జయమోహన్ తంపి కుమారుడు అశ్విన్ ని మొదటినుంచి అనుమానిస్తూ వచ్చారు అయితే ఆ అనుమానం కాస్త నిజమైంది. పోలీసులు ఆరా తీయగా ...కె. జయమోహన్ తంపి మరియు అతని కుమారుడు ఇద్దరు కలసి వారి ఇంట్లోనే మద్యాన్ని సేవించే వారు. లాక్ డౌన్ సమయంలో వారికీ ఈ చర్య నిత్యకృత్యం అయ్యింది. అయితే హత్యకు గురైన సోమవారం వారిద్దరూ తమ ఇంట్లోనే కూర్చొని మందు తాగారు.

 

 

మందు అయిపోవడంతో తన తండ్రి మరింత మద్యాన్ని  కోరడంతో ...అశ్విన్ తన తండ్రి డెబిట్ కార్డు ని వాడడానికి ప్రయత్నించాడు అయితే ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొనగా ...కొడుకు తండ్రిని దూరంగా నెట్టివేయడంతో ...జయమోహన్ తలకి బలమైన గాయం అవ్వడంతో అక్కడికక్కడే చనిపోయాడు..అయితే ఈ విషయాన్నీ గ్రహించని కొడుకు మిగిలిన మద్యాన్ని సేవించి అక్కడే నిద్రపోయాడు...అయితే ఈ విషయమై ఏమీ తెలియనట్టు నటిస్తున్న అశ్విన్ పై పోలీసులకు అనుమానం రావడంతో ...పోస్టుమార్ట‌మ్ చేయించగా అసలువిషయం బయటపడింది...పోలిసులు కేసు నమోదుచేసి విచారణ కొనసాగించి అసలు విషయం బయటపెట్టారు. అయితే ఈ హత్య కి  కారణం ఇంత సిల్లీ రీజ‌న్ కావడంతో పోలీసులు షాక్ అయ్యారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: