తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మిడతల దండు ప్రమాదం పొంచి ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ నిన్న సూచనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు రాష్ట్రానికి సమీపంలోనే మిడతల దండు ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన అధికారులు మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. 
 
రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ వద్ద గల అజ్ని అనే గ్రామం వద్ద ప్రస్తుతం మిడతల దండు ఉంది. మిడతల దండు ప్రయాణం దక్షిణం వైపు సాగితే మాత్రం తక్కువ సమయంలో తెలంగాణలోకి మిడతలు ప్రవేశించే ప్రమాదం ఉంది. మిడతల దండు దక్షిణం వైపు వస్తే ఏ క్షణమైనా ముప్పేపని భావించి సీఎం కేసీఆర్ మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: